భూ ఆక్రమణ యత్నాలపై కలెక్టరేట్ ఎదుట గ్రామస్తుల నిరసన

కలం, నిర్మల్ : పెంబి మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని (Government Land) కాపాడాలని, దాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు (Pembi Villagers) సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వే నంబర్లు 202, 205లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

2024లోనే సంబంధిత తహసీల్దార్ సదరు సర్వే నంబర్లలోని భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించినప్పటికీ, ఆక్రమణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టడంతో పాటు ప్రభుత్వ భూమిని పరిరక్షించి, ఆక్రమణకు యత్నిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>