తమిళనాడు సీఎం విజయ్ ఏపీ టూర్ ఫిక్స్!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) ఏపీకి రాబోతున్నారు. ఈ నెల 13న విజయవాడ చేరుకోనున్న సీఎం విజయ్ విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనబోతున్నారు. ఇటీవలే పలువురు టీడీపీ ఎంపీలు ఆయన్ను ప్రత్యేకంగా కలిసి ఉత్సవాలకు రావాలని కోరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత విజయ్ ఏపీకి రాబోతుండటం ఇదే మొదటిసారి. ఇంద్రకీలాద్రి కొండపై దుర్గమ్మ వారిని దర్శించుకున్నాక.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ కాబోతున్నారు.

సీఎం చంద్రబాబుతో విజయ్ కృష్ణా జలాల వాటాపై ప్రధానంగా చర్చించబోతున్నారు. తెలుగు గంగ ఒప్పందం ప్రకారం చెన్నైకి రావాల్సిన నీరు సరఫరా కావడం లేదని కొంతకాలంగా తమిళనాడు పదే పదే అభ్యంతరం చెబుతోంది. దీని గురించి మరోసారి సీఎం చంద్రబాబు వద్ద లేవనెత్తే అవకాశం ఉంది. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కూడా భేటీ అయి.. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో అటవీ, పర్యావరణ సమస్యలు, ఇతర అంశాలపై చర్చించబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>