త‌ల్లికి వంద‌నం రెండో ద‌శ‌కు లైన్ క్లియ‌ర్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ ప్రభుత్వం త‌ల్లికి వంద‌నం (Thalliki Vandanam) ల‌బ్ధిదారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెండో విడ‌త‌లో ఈ ప‌థ‌కం అమలుకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్ర‌భుత్వం నేడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. పథకం అమలుకు రూ.10,120.78 కోట్లను కేటాయిస్తున్న‌ట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మొద‌టి విడ‌త నిధుల విడుద‌ల స‌మ‌యంలో సాంకేతిక కార‌ణాలు, అడ్మిష‌న్ల ప్ర‌క్రియ పూర్తి కాక‌పోవ‌డం దృష్టా చాలామందికి నిధులు జ‌మ కాలేదు. వీరికి ప్ర‌భుత్వం మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించింది. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను మ‌రోసారి ప‌రిశీలించి రెండో విడ‌త‌లో 3,29,201 మందిని ల‌బ్ధిదారులుగా ఎంపిక చేశారు.

తల్లికి వందనం పథకం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా, అర్హత కలిగిన తల్లి లేదా సంరక్షకురాలికి ఒక్కో బిడ్డకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్‌, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులు, 42,70,802 మంది అర్హులైన తల్లులు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>