చంద్రబాబుతో సీఎం విజయ్ భేటీ

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిసారి ఏపీ పర్యటన, తన నివాసానికి వచ్చిన సీఎం విజయ్‌కు చంద్రబాబు, మంత్రి లోకేశ్​ ఘన స్వాగతం పలికారు. ఇతర మంత్రులు, పార్టీ నేతలను చంద్రబాబు పరిచయం చేశారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతున్నారు.

ప్రధానంగా చెన్నైకి తెలుగు గంగ ప్రాజెక్ట్ నీటిని పెంచాలని సీఎం విజయ్ కోరారు. గత కొన్ని నెలలుగా నీటి విడుదల తగ్గుతున్నట్లు వివరించారు. అంతేగాకుండా, గోదావరి –కావేరి నదుల అనుసంధానంపై కూడా సమీక్ష చేస్తున్నారు. కావేరిలో వరద తక్కువగా వస్తున్న నేపథ్యంలో.. గోదావరి నది నీటిని దశలవారీగా మళ్లిస్తే ఇరు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సుమారు గంటా 10 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>