ఓట్ చోరీ జరిగిందని తేలిపోయింది: ఖర్గే

కలం, వెబ్ డెస్క్: దేశంలో ఓట్ చోరీ జరిగిందనే విషయం తేలిపోయిందని.. ప్రజలకు స్పష్టంగా అర్థమైందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలిపారు. ఇండియా కూటమి చేపట్టిన ఆందోళనలకు దేశ వ్యాప్తంగా వచ్చిన స్పందనే అందుకు నిదర్శనం అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష ఎంపీలకు ఇచ్చిన టీ విందు కార్యక్రమం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. రాహుల్ సహా ఇతర నేతలు ప్రజా సమస్యలపై అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. యువత, ఢిల్లీ ప్రజలు ఇలా రోడ్ల మీదకు రావడం ఇదే మొదటిసారి అన్నారు. ప్రధాని మోదీ ఓట్లను ఎలా దొంగతనం చేశారో.. చేయబోతున్నారో ఈ పాటికే అందరికీ అర్థమైపోయిందన్నారు.

ఇదంతా బీజేపీ ప్లాన్: తేజస్వీ యాదవ్

ప్రజాస్వామ్యాన్ని మోసం చేసేందుకు జ్ఞానేష్ కుమార్ ద్వారా మోదీ, అమిత్ షా చేస్తున్న కుట్ర బహిరంగమైందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు తామంతా ఒక్కటైనట్లు వివరించారు. దీని కోసం తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను హైజాక్ చేస్తూ వస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని వాడుకుంటోందన్నారు. మోదీ, అమిత్ షా చేతిలో జ్ఞానేష్ కుమార్ తోలు బొమ్మలా మారిపోయినట్లు విమర్శించారు. కచ్చితంగా ఆయనకు తగిన శిక్ష పడుతుందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>