విజయ్ మార్క్ రాజకీయం.. అన్నాడీఎంకేకు బిగ్ షాక్!

కలం, వెబ్ డెస్క్ : టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ మార్క్ రాజకీయంతో విపక్ష అన్నాడీఎంకే (AIADMK)కు భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీని ఒక్కొక్కరిగా వీడిపోతున్నారు. ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా అన్నాడీఎంకే మరో ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా చేశారు. ఈ మేరకు విజయభాస్కర్ సోమవారం చెన్నైలోని రాష్ట్ర సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామాను అందజేశారు.

కాగా, జయలలిత మంత్రివర్గంలో విజయభాస్కర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రాజీనామాతో అసెంబ్లీలో అన్నాడీఎంకే (AIADMK) బలం 41కి పడిపోయింది. అలాగే తాజా పరిణామంతో తమిళనాడులో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిలో సీఎం రాజీనామా చేసిన తిరుచ్చి కూడా ఉంది. ఈ నియోజకవర్గాలకు త్వరలో ఉప ఎన్నికలు నిర్వహించనుండగా.. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ భవిష్యత్ లో టీవీకే పార్టీ గుర్తుపైనే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>