epaper
Sunday, February 22, 2026
epaper

తమిళ నటి​ తండ్రి దారుణ హత్య

కలం, వెబ్​ డెస్క్​: తమిళ సినిమా నటి​ విష్ణుప్రియ (Tamil Actress Vishnupriya) తండ్రి సూర్యనారాయణన్​ (73) దారుణ హత్యకు గురయ్యారు. దిండిగల్​​ జిల్లా కొడైకెనాల్​లోని తన సొంత రిసార్ట్​లో ఆయన్ని దుండగులు కిరాతకంగా చంపేశారు. అనంతరం రిసార్ట్​లోని నగలు, నగదుతో పరారయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​కు చెందిన సూర్యానారాయణన్​ కొడైకెనాల్ సమీపంలోని కురింజి ఆండవర్​ ఆలయం సమీపంలో రిసార్ట్​ ఉంది. కోయంబత్తూరుకు చెందిన ఐదుగురు యువకులు రెండు రోజుల కిందట ఇక్కడ అద్దెకు దిగారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రిసార్ట్స్​లోని పనివాళ్లు పని ముగించుకొని వెళ్లిపోయారు. ఆర్ముగం, మురళి అనే ఇద్దరు కాపలాదారులు ఉన్నారు.

ఇదే అదనుగా భావించిన యువకులు వాళ్లిద్దరినీ తాళ్లతో కట్టేసి, సూర్యనారాయణన్​ను బంధించారు. స్విమ్మింగ్​పూల్​ సమీపంలోని కుర్చీలో చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేశారు. అనంతరం ముక్కు, నోరు మూసేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. మరుసటి రోజు రిసార్ట్​కు వచ్చిన పనవాళ్లు విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూర్యనారాయణన్​ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అలాగే రిసార్ట్​ నుంచి భారీగా నగదు, నగలతోపాటు సీసీ టీవీలను ఎత్తుకుపోయినట్లు తేల్చారు. నిదితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.

పాత పగతోనే?

సూర్యనారాయణన్​ కుమార్తె విష్ణుప్రియ (Tamil Actress Vishnupriya) అనేక తమిళ సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు. ఆమె దివ్యాంగురాలిగా నటించిన ‘మాయావి’ సినిమా ఎంతో పేరు తెచ్చింది. అయితే, డ్రైవర్​ ప్రభాకరన్​తో విష్ణుప్రియ ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్ల కిందట వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే 2018లో ప్రభాకరన్​ గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఇప్పుడు, అందుకు ప్రతీకారంగానే సూర్యనారాయణన్​ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, విష్ణుప్రియ ప్రస్తుతం చెన్నలో నివాసం ఉంటోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>