కలం వెబ్ డెస్క్ : ప్రభుత్వం సికింద్రాబాద్ (Secunderabad) పేరును మారుస్తుందంటూ బీఆర్ఎస్ (BRS) ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం నుంచే పోలీసులు సికింద్రాబాద్ చేరుకొని ర్యాలీకి అనుమతులు లేవని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీనిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతామనుకుంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని మండిపడ్డారు. కర్ఫ్యూని తలపించే విధంగా వేలాది పోలీసులు వచ్చారని ఆగ్రహం చేశారు. ఇలా దుర్మార్గంగా అరెస్ట్ చేయడం దారుణమని ఖండించారు. ఫిబ్రవరి మొదటి వారంలో కోర్టుకు వెళ్లి న్యాయపరంగా అనుమతులు తీసుకొని ర్యాలీ చేపడతామని చెప్పారు.
సికింద్రాబాద్ అస్తిత్వంపై దెబ్బకొడితే సహించేది లేదన్నారు. తనతో పాటు అంబర్‌పేట్ ఎమ్మెల్యే, ముషీరాబాద్ ఎమ్మెల్యేలను ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామన్నారన్నారు. తమది శాంతియుత ర్యాలీ అని, రాజకీయం కాదని చెప్పారు. అందులో ఎన్నో సంఘాలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇలా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.

Read Also: అర్ష్‌దీప్‌ను పక్కనబెట్టడం అన్యాయం : అశ్విన్
Follow Us On : WhatsApp


