కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా ఫస్ట్’ అంటూనే సొంత దేశస్తులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాడు. టారీఫ్‌లు, వీసాలు, వలస విధాన చర్యలకు దిగడంతో ఇతర దేశస్తులే కాదు.. అమెరికన్స్ సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అక్రమ వలసదారులను గుర్తించి పట్టుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ (ICE)ని అమలు చేస్తున్నాడు.
అధికారులు ఇమ్మిగ్రేషన్ జనాభాపై కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దీనిపై ప్రజావ్యతిరేకత ఉన్నప్పటికీ, ICE బృందాలు లెక్క చేయడం లేదు. విధుల నిర్వహణలో ఉన్న అధికారులకు ఇతరుల పట్ల అనుమానం వస్తే సరైన గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని యునైటెడ్ స్టేట్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో సొంత దేశస్తులు సైతం ID ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎవరు నిర్లక్యం వహించినా చర్యలు తీసుకుంటామని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.

Read Also: సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బ తీస్తోంది: కేటీఆర్
Follow Us On: X(Twitter)


