epaper
Tuesday, March 3, 2026
epaper

మరికాసేపట్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన..?

కలం, డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ (Congress) మరికొద్ది సేపట్లో రాజ్యసభ సీట్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి రెండు రాజ్యసభ సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. అందులో ఒకటి ఏఐసీసీ కోటా అయితే.. రెండోది రాష్ట్ర కోటా. అభిషేక్ సింఘ్వీకి తెలంగాణ తరఫున మరోసారి అవకాశం దక్కేలా ఉంది. ఈ క్రమంలోనే రేపు అభిషేక్ తెలంగాణకు వస్తున్నారు. మిగిలిన ఎంపీ పదవి కోసం సీనియర్ నేతలు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందో అని కాంగ్రెస్ (Congress) నేతలు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!