కలం వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ (MSVPG) సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని సినిమాల్లోకెల్లా మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబడుతోంది. ఈ మూవీ తాజాగా మరో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో (Book My Show) అత్యంత వేగంగా 25 లక్షల టికెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో మూవీ టీం, మెగా ఫ్యాన్స్ మరింత ఖుషీ అయిపోతున్నారు.
Read Also: 2027 సంక్రాంతికి వచ్చే సినిమాలేంటో తెలుసా..?
Follow Us On: Sharechat


