కలం వెబ్ డెస్క్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను (Arshdeep Singh) పక్కనబెట్టడాన్ని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తప్పుబట్టాడు. ఇది అన్యాయమని, టాలెంట్‌ను తొక్కేయడమేనన్నాడు. న్యూజిలాండ్‌తో సాగుతున్న వన్డే సిరీస్‌లో వడోదరా, రాజ్‌కోట్ మ్యాచ్‌లకు అతడిని బెంచ్‌కే పరిమితం చేయడాన్ని గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్‌పై ఘాటుగా విమర్శించాడు.
14 వన్డేల్లో 22 వికెట్లు సాధించిన అర్ష్‌దీప్, 25కు లోపే సగటు నమోదు చేసినప్పటికీ జట్టులో చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్ విజయంలో కీలకంగా నిలిచిన అతడిని పక్కన పెట్టి ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna), హర్షిత్ రాణాలకు (Harshit Rana) ప్రాధాన్యం ఇవ్వడం పెద్ద చర్చకు దారి తీసింది. బౌలర్ల రిథమ్‌పై ఇలాంటి నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపుతాయని అశ్విన్ స్పష్టం చేశాడు. “ప్రతి సారి బంతి ఇచ్చినప్పుడు అతడు ఫలితం ఇచ్చాడు. అతడికి అర్హత ఉన్న స్థానం ఇవ్వాలి. గర్వంగా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి నడిచే అవకాశం కల్పించాలి” అని అన్నాడు. మూడో వన్డే పిలుపు ఆలస్యమైందని కూడా ప్రశ్నించాడు.
పనిభారం సమతుల్యత కోసమే రొటేషన్ చేశామని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పినా, అశ్విన్ మాత్రం ఆ వివరణను అంగీకరించలేదు. “ఇది గతంలో ఎంత ఆడాడన్న అంశం కాదు. ఇప్పుడతడి మనసులో నడుస్తున్న భావాలే అసలు విషయం” అని స్పష్టంగా చెప్పాడు. “క్రికెట్ అనేది ఆత్మవిశ్వాసంతో నడిచే ఆట. బౌలర్లకు ఇలాంటి పరిస్థితులు అన్యాయమే. నేను ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నాను. అందుకే అర్ష్‌దీప్ కోసం నేను ఎప్పుడూ నిలబడతాను” అని అశ్విన్ (Ravichandran Ashwin) తేల్చిచెప్పాడు.
Read Also: ఆ విషయంలో బోయపాటిని బీట్ చేసిన అనిల్ రావిపూడి
Follow Us On: Sharechat


