epaper
Wednesday, February 18, 2026
epaper

KCRపై చర్యలు తీసుకోకుంటే సీఎం రాజీనామా చేయాలి: కిషన్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : కేసీఆర్ పై చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డిని (Revanth Reddy) ఎవరు అడ్డుకుంటున్నారో స్పష్టం చేయాలని, లేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అధికారంలో ఉన్నాననే విషయాన్ని మరిచిపోయి, ఇప్పటికీ ప్రతిపక్షంలోనే ఉన్నట్లు భావిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ అనుసరిస్తున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆయన మాట్లాడుతున్న మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎద్దేవా చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి వచ్చినా ముఖ్యమంత్రి తీరులో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అన్నరు.

నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై అనుమానాలు ఉన్నాయని కిషన్​ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టి, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని ఆయన తెలిపారు.

Read Also: కేసీఆర్ చరిత్ర అంతా అక్రమాలే.. దాన్ని నేను చెరపను : సీఎం రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>