Mobile Popup Ad
Mobile Popup Ad

లక్కీ టైలర్.. రూ.వెయ్యితో 50 లక్షల లాటరీ గెలుపు

కల, వెబ్ డెస్క్ : అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదు. కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి లక్ ఆమడదూరంలో ఉంటుంది. మరికొందరికి వద్దన్న అదృష్టం వెనుకాలే ఉంటుంది. అయితే, రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఓ మహిళను అదృష్ట దేవత కనుకరించింది. రూ. 1000 ఆమెను లక్షాధికారిని చేసింది. కొన్నేళ్లుగా కట్టు మిషన్ పై బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్న ఆమె లాటరీ రూపంలో ఏకంగా రూ.50 లక్షలు గెలుచుకుంది. పంజాబ్ రాష్ట్రం లుధియానా జిల్లా చందర్ నగర్ కు చెందిన కుసుమ్ రాణి అనే మహిళ (50) లాటరీ గెలిచి ఇప్పుడు వార్తల్లో నిలిచారు.

నిత్యం కుట్టు పని చేసుకుంటూ తన కుటుంబాన్ని సాకుతున్న కుసుమ్ రాణి కొన్నాళ్ల క్రితం లాటరీ కొనుగోలు చేశారు. రూ.వెయ్యి పెట్టి పంజాబ్ ప్రభుత్వం ధృవీకరణ ఉన్న డియర్ అనే కంపెనీ నుంచి కొన్న లాటరీ ఆమె జీవితాన్ని మార్చేసింది. తొలిసారి కొన్న లాటరీతోనే రూ.50 లక్షలు గెలిచుకుని జాక్ పాట్ కొట్టేసింది. దీంతో కుసుమ్ రాణి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమెను లాటరీ విక్రేతలు ఘనంగా సన్మానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>