Mobile Popup Ad
Mobile Popup Ad

అక్షర్​ డబుల్ ధమాకా.. కివీస్‌ మూడు వికెట్లు ఫట్

కలం, వెబ్​ డెస్క్​: టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో న్యూజిలాండ్ వెన్నుముక విరిచాడు(T20 World Cup Final). 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు అక్షర్ వరుస షాక్‌లు ఇస్తూ మ్యాచ్‌ను భారత్ వైపు మొగ్గేలా చేశాడు. ప్రమాదకరమైన గ్లెన్ ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసి కివీస్ మూడో వికెట్‌ను నేలకూల్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతకుముందే ఓపెనర్ ఫిన్ అలెన్‌ను అవుట్ చేసిన అక్షర్, ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్‌ను పెవిలియన్ పంపాడు. అక్షర్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఫిలిప్స్, కేవలం 5 పరుగుల (5 బంతుల్లో, 1 ఫోర్) వద్ద బౌల్డ్ అయ్యారు. అక్షర్ పటేల్ ఇప్పటివరకు 1.5 ఓవర్లలో కేవలం 18 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ 4.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసి తీవ్ర ఒత్తిడిలో ఉంది(T20 World Cup Final). టిమ్ సీఫెర్ట్ 15 బంతుల్లో 31 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. రచిన్ రవీంద్ర.. జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతికే ఇషాన్ కిషన్ పట్టిన అద్భుత క్యాచ్‌కు అవుట్ అయ్యాడు. ఫిన్ అలెన్ 9 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (1 వికెట్) కివీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా తన తొలి ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి ఒక వికెట్ సాధించగా, అర్షదీప్ సింగ్ ఒక ఓవర్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>