అన్ని పార్టీల్లో నాకు గౌరవం దక్కింది: మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: తాను తప్పు చేస్తే ఎన్నుకున్న ప్రజలకు చెడ్డ పేరు వస్తుందని 40 ఏళ్ల నుంచి, ఒక యజ్ఞం చేసినట్లుగా నిష్టగా రాజకీయం చేస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) పేర్కొన్నారు. గురువారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో సీసీ డ్రైన్, రోడ్డు నిర్మాణ పనులకు యూపీఎస్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. నేతాజీ పార్క్, డి.ఎఫ్.టి. స్కీం కింద తాగునీటి సరఫరా సౌకర్యాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఖమ్మం ప్రజలు, శ్రీ రామచంద్రమూర్తి ఇచ్చిన అవకాశం మేరకు గత 40 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నానన్నారు. మొదట ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని, అన్ని పార్టీల్లో సముచితమైన స్థానం, గౌరవం తనకు లభించిందని వివరించారు.

భారీ ప్రాజెక్టులు తెచ్చి..

పల్లె పల్లెకు రహదారి, మంచి నీరు విద్య, వైద్యం సౌకర్యంతో పాటు భారీ ప్రాజెక్టులు కూడా తీసుకుని వచ్చి ఖమ్మం జిల్లా చరిత్రలో తనకు ఒక పేరు ఉండేలా అభివృద్ధి పనులు చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. అనంతరం ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ మాట్లాడుతూ.. 24 గంటల పాటు నీరు వచ్చే విధంగా అల్లిపురంలో వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కారణంగా ఇక్కడ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, ఖమ్మం నగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల, స్వామి నారాయణ కళాశాల, ఇస్కాన్ టెంపుల్, వెలుగు మట్ల అర్భన్ పార్క్, ఖమ్మం ఖిల్లాకు రోప్ వే నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>