Mobile Popup Ad
Mobile Popup Ad

పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం..

కలం మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా టేక్మాల్ మండలం సాలోజిపల్లి (Salozipalli)  గ్రామంలో పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం (Postmortem) నిర్వహించారు. ఈ నెల 12న పోచయ్య (78) అనే వ్యక్తి మరణించగా, మొదట ఆయన అనారోగ్యంతోనే చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. మృతుడి కుమారుడు శ్రీశైలం తన తండ్రి అనారోగ్య కారణాల వల్లే మృతి చెందినట్లు తెలిపాడు. అయితే పోచయ్య గొంతుపై గాయాలు కనిపించడంతో.. కుమార్తె ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన తండ్రి మృతి సహజం కాదని.. తండ్రీకొడుకుల మధ్య గత కొన్నేళ్లుగా భూ వివాదం కొనసాగుతోందని, అదే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు పోచయ్య మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసి, ఫోరెన్సిక్ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో యువతి హల్ చల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>