కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికలు (Tamil Nadu Elections) ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖులంతా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సామాన్యులకు ట్రాన్స్‌పోర్ట్ ఇబ్బందులతో పోలింగ్ బూత్‌లకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఓటు వేసిన సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కానీ, నటి త్రిష మీడియాతో మాట్లాడుతూ.. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక మరో తమిళ నటుడు ఏకంగా ఏ పార్టీకి ఓటేశాడో కూడా చెప్పేశాడు. అందరూ అదే పార్టీకి ఓటు వేయాలని అందరినీ కోరాడు. ఆయన ఎవరో కాదు.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెండెట్ ఉన్నావ్ అనే డైలాగ్‌తో ఫేమస్ అయిన వీటీవీ గణేష్ (VTV Ganesh).
తమిళ నటుడు వీటీవీ గణేష్ (VTV Ganesh) తెలుగులో సైతం పలు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ రోజు ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కు వినియోగించుకొని మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను టీవీకేకు ఓటు వేశానని చెప్పాడు. అందరూ టీవీకేకు ఓటు వేయాలని, విజయ్‌ని సీఎం చేయాలని పిలుపునిచ్చారు. విజయ్ సీఎం అయితే సమాజంలో మార్పు తీసుకొస్తారని, అభివృద్ధి చేస్తారని గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ నటులు ఎవ్వరూ తాము ఎవరికి ఓటు వేశారనే విషయం చెప్పకపోయినా గణేష్ మాత్రం మీడియా ముందే చెప్పేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: భారత రెజ్లింగ్ కోచ్‌గా షాకో బెంతినీడిస్ కంబ్యాక్ !
Follow Us On: Instagram

