యాదగిరిగుట్టలో గ్యాస్ ఏజెన్సీపై అధికారుల ఆకస్మిక తనిఖీలు

కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta ) పట్టణంలోని శ్రీ లక్ష్మి నరసింహ ఎంటర్‌ప్రైజెస్ ఏజెన్సీ గోడౌన్ ను చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ప్రజల నుండి ప్రతి సిలిండర్ పైన 996 రూపాయల 50 పైసలు మాత్రమే తీసుకోవాలని, అధికంగా వసులు చేసిన యెడల ఏజెన్సీ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత కొన్ని ఏళ్లుగా వినియోగదారులకు హెచ్ పీ గ్యాస్ సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మి నరసింహ ఎంటర్‌ప్రైజెస్ గ్యాస్ ఏజెన్సీ గ్రూహోపాకరుణ సిలిండర్లను హోటల్, దాబా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, టీ పాయింట్ లకు సరఫరా చేస్తున్నారని మండల ప్రజలు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ గ్యాస్ ను వ్యాపారస్థులకు విక్రయించడం ద్వారా ఇండ్లకు వంట గ్యాస్ కొరత ఏర్పడుతుందని ప్రజలు వాపోతున్నారని.. చిన్న, పెద్ద వినియోగదారులు వ్యాపారులకు కొన్ని సంవత్సరాల నుండి డొమెస్టిక్ గ్యాస్ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు పెదగా వినిపిస్తున్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిల్లర్లు, ప్రజా ప్రతినిధులు స్థానికులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>