Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో యువతి హల్ చల్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లోని బంజారాహిల్స్ స్టడీ సర్కిల్ వద్ద బుధవారం మిడ్ నైట్ జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk Driving) తనిఖీల్లో ఓ యువతి హల్ చల్ చేసింది. మద్యం మత్తులో కారు నడుపుతూ యువతి పట్టుబడింది. పోలీసులకు సహకరించకపోగా వారితో వాగ్వాదానికి దిగింది. ‘నేను బ్రీత్ అనలైజర్ ఊదను.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ రెచ్చిపోయింది. తన కారు కీస్ వెంటనే ఇచ్చేయాలంటూ ట్రాఫిక్ పోలీసులపై కేకలు వేస్తూ హంగామా చేసింది. చివరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం కారును సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>