epaper
Wednesday, February 18, 2026
epaper

భువనగిరి, మిర్యాలగూడ చైర్మన్లపై సస్పెన్స్

కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తో సహా 17 మున్సిపాలిటిల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక దాదాపు ఖరారు అయింది. ఒక్క మిర్యాలగూడ (Miryalaguda), భువనగిరి (Bhuvanagiri) మున్సిపాలిటీ చైర్మన్ల విషయంలో మాత్రమే ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. ఈ రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది.

నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి..

నల్లగొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మరో ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో నల్లగొండ కార్పొరేషన్ మేయర్ గా బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుగానే ప్రకటించారు. ఆ మేరకు బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని మేయర్ గా ఫైనల్ చేశారు. డిప్యూటీ మేయర్ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డిప్యూటీ మేయర్ పదవిని మైనార్టీలకు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మైనార్టీల నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి ఇబ్రహీం కు డిప్యూటీ మేయర్ పదవి వరించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. మిర్యాలగూడ మున్సిపాలిటీ విషయానికి వచ్చేసరికి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఎవరు ఊహించని విధంగా మిర్యాలగూడలో అత్యధిక స్థానాలను ఎమ్మెల్యే బిఎల్ఆర్ సొంతం చేసుకోవడం గమనార్హం.

మిర్యాలగూడ (Miryalaguda) మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో ఎవరి పేర్లు ఫైనల్ కాకపోవడంతో ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది. నిజానికి మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పదవిని ఐదుగురు కౌన్సిలర్లు ఆశిస్తున్నారు. ఇందులో వేణుగోపాల్ రెడ్డి, గుడిపాటి నవీన్, మిట్టపల్లి వెంకటేశం, బాలు, జితేందర్ రెడ్డి ఈ రేసులో ఉన్నారు. ఇందులో చైర్మన్ పదవి ఎవరిని వరించనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపోతే.. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా పున్న శైలజా వెంకటేశ్వర్లు, చండూరు మున్సిపల్ చైర్మన్ గా కోడి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా భూతరాజు దశరథ, చిట్యాల మున్సిపల్ చైర్మన్ గా పందిరి గీత, హాలియా మున్సిపల్ చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి, నందికొండ చైర్మన్ గా మానస స్వర్ణ పేర్లు ముందుగానే ఖరారు అయిన సంగతి తెలిసిందే. వైస్ చైర్మన్ల పేర్లు కొన్ని మున్సిపాలిటీలో ఖరారు కావాల్సి ఉంది.

సూర్యాపేట జిల్లాలో ఇలా..

సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి ఇందులో నాలుగు మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేజిక్కించుకోగా, తిరుమలగిరి మున్సిపాలిటీ బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా మోరిశెట్టి నివేదిత లక్ష్యాది, కోదాడ మున్సిపల్ చైర్మన్ గా ఎర్నేని కుసుమ బాబు, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా తన్నీరు మల్లికార్జున్, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా కొణతం చినవెంకట్ వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ గా సంకెనపల్లి రఘునందన్ రెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఆరు మున్సిపాలిటీలు ఉండగా, అన్ని స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గా గుండ్లపల్లి వాణి, మోత్కూరు మున్సిపాలిటీ చైర్మన్ గా గడ్డం స్వప్న, పోచంపల్లి చైర్మన్ గా తడక వెంకటేశం పేర్లు ఖరారయ్యాయి. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ గా మొగుదల పావని రమేష్ గౌడ్ ఫైనల్ అయింది. వాస్తవానికి చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ గా అభ్యర్థిగా వెన్ రెడ్డి సంధ్య పేరును ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. కానీ ఎన్నికల్లో సంధ్య ఓడిపోవడంతో చైర్మన్ పదవి అదృష్టం రమేష్ గౌడ్ ను వరించింది.

Read Also: ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ‘టగ్ ఆఫ్ వార్’.. పై చేయి ఎవరిది?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>