epaper
Wednesday, February 18, 2026
epaper

పాక్ మిస్టరీ స్పిన్నర్‌కు సూర్యకుమార్ యాదవ్ కౌంటర్!

కలం, స్పోర్ట్స్​ : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్–పాకిస్థాన్ (IND vs PAK) హైవోల్టేజ్ పోరుకు వేదిక సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ధీమా వ్యక్తం చేశారు. తారిక్ సవాల్‌ను స్వీకరించేందుకు జట్టు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో తారిక్ గురించి అడిగిన ప్రశ్నకు సూర్య ఆసక్తికరంగా స్పందించారు. పరీక్షలో సిలబస్ దాటిన ప్రశ్న వచ్చినా సమాధానం రాయాల్సిందేనని, అలాగే అతని బౌలింగ్‌ను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. నెట్స్‌లో తగిన ప్రాక్టీస్ చేశామని, జెట్‌లాగ్ సమస్యలు లేవని సూర్య తెలిపారు.

ఎంఎస్ ధోనీ (MS Dhoni) స్ఫూర్తితో క్రికెట్‌లోకి వచ్చిన తారిక్ తన వింత యాక్షన్‌తో గుర్తింపు పొందారు. ప్రస్తుత టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి ఫామ్‌లో ఉన్నారు. నాలుగు టీ20ల్లో 7.90 సగటుతో 11 వికెట్లు, 5.93 ఎకానమీతో ఆకట్టుకున్నారు. తన యాక్షన్‌పై గతంలో విమర్శలు వచ్చినప్పటికీ రెండు సార్లు అధికారికంగా క్లీన్ చిట్ లభించింది. మోచేయి సహజంగా వంగి ఉండటంతో అపోహలు కలుగుతున్నాయని తారిక్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఆసక్తి మొత్తం ఒక్కటే. తారిక్ మిస్టరీని టీమిండియా ఎలా ఛేదిస్తుంది? చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్​ (IND vs PAK) మరింత ఉత్కంఠ రేపుతోంది.

Read Also: ద్రవిడ్, కుంబ్లేకు ప్రత్యేక గౌరవం

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>