epaper
Wednesday, February 18, 2026
epaper

15 ఏళ్లు సహజీవనం చేసి.. ప్రేమికుల రోజు చంపేశాడు

కలం, వెబ్​డెస్క్​: ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 15 ఏళ్లు సహజీవనం చేశారు. అయితే, పెళ్లి అనేసరికి విభేదాలు వచ్చాయి. అంతే, ప్రేమికురాలిని తుపాకీతో కాల్చి తానూ చనిపోయాడు. ఈ సంఘటన ప్రేమికుల రోజైన శనివారం ఢిల్లీ శివారులోని నోయిడా (Noida)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం దాద్రి రోడ్డులోని పిల్లర్​ నెం.84 వద్ద ఓ కారు అనుమానాస్పదంగా ఉన్నట్లు సెక్టార్​ 39 పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా, డోర్లు లోపలి వైపు నుంచి లాక్ వేసినట్లు గుర్తించారు. వెంటనే మెకానిక్​ను రప్పించి తెరిపించి చూడగా లోపల రెండు మృతదేహాలు కనిపించాయి. ఓ వ్యక్తి మహిళను కాల్చి చంపి, అనంతరం తానూ కాల్చుకొని చనిపోయినట్లు గుర్తించారు. అంతేకాదు, లోపల ఓ లేఖ రాసి ఉండడం గమనించారు.

అందులో ఉన్న వివరాల ప్రకారం సుమిత్​ (31), రేఖ(26) దాదాపు 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, ఇటీవల రేఖకు పెళ్లి నిశ్చయమైంది. దీంతో తాము విడిపోదామని చెప్పింది. దీనికి అంగీకరించని సుమిత్​.. మాట్లాడుకుందామంటూ యువతిని పిలిచాడు. ఇద్దరూ కార్లో వెళుతుండగా, మాటామాటా పెరిగింది. సుమిత్​ ఆవేశంలో తుపాకీతో రేఖను కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకొని చనిపోయాడు. కాగా, వీళ్లిద్దరూ కనిపించడం లేదంటూ వాళ్ల తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. సుమిత్​ది ఢిల్లీలోని త్రిలోక్​పురి కాగా, రేఖ కుటుంబం నోయిడా (Noida) లోని సెక్టార్​ 101లో ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ మిస్సింగ్.. ఐదు రోజులైనా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>