కలం, వెబ్ డెస్క్ : గుజరాత్ లోని ప్రఖ్యాత సోమనాథ్ దేవాలయం (Somnath Temple) పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ‘సోమనాథ్ అమృత మహోత్సం -2026’ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆలయం (Somnath Temple) గగనతలంపై భారత వైమానిక దళం (IAF) ఎయిర్ షో నిర్వహించింది.
సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించింది. 15 నిమిషాల పాటు నిర్వహించిన ఈ ఎయిర్ షో తో చూపరుల ఒళ్లు గగుర్పొడిచింది. గగనతలంలో యుద్ధవిమానాలు జాతీయ జెండా రంగు పొగను ప్రదర్శించారు. ఈ వేడుకలకు సంబంధించి ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.

