Mobile Popup Ad
Mobile Popup Ad

సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

కలం, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘విశ్వనాథ్ & సన్స్'(Vishwanath And Sons) రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

దర్శకుడు వెంకీ అట్లూరి గతంలో తీసిన ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న ఈ చిత్రం అదే స్థాయిలో ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో విడుదలైన ఈ సినిమా  టీజర్‌‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై సినిమా వర్గాలలో భారీ బజ్ నెలకొనగా, #Suriya #Vishwanath And Sons హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>