బాలికల భద్రతపై అప్రమత్తత అవసరం: సీనియర్ సివిల్ జడ్జి రాధిక

కలం, నిర్మల్: బాలికల భద్రతపై అప్రమత్తత అవసరం అని నిర్మల్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి జి. రాధిక (Judge Radhika) అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ (Surakshit Bachpan Abhiyan) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులతో మాట్లాడకూడదని, వారు ఇచ్చే బహుమతులను స్వీకరించకూడదని సూచించారు. చదువును మధ్యలోనే ఆపకుండా ఉన్నత విద్యను కొనసాగిస్తే భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధ పద్మ, కౌన్సిలర్లు శనిగారపు నరేష్, అయిండ్ల విజయలక్ష్మి, సాత్విక్, రూరల్ ఎస్సై లింబాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>