కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేశ సమైక్యత, సమగ్రతల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని (National Unity Day) పురస్కరించుకొని శనివారం మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
దేశాన్ని ఐకమత్యంగా ఉంచడంలో కృషిచేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని, దేశానికి దిశా నిర్దేశం చేసిన ఆయన చిరస్మరణీయుడని అన్నారు.
అనంతరం దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకిత మవుతానని, దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వీయ తోడ్పాటు నందిస్తానని జిల్లా కలెక్టర్ అధికారులు, ఉద్యోగులచే రాష్ట్రీయ ఏక్తా దినోత్సవ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, డీఆర్ఓ ఏ నిర్మల,
జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

