సుప్రియా సూలేకు తప్పిన భారీ ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: ఎన్సీపీ కీలక నేత, ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule)  రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబయి–పుణే హైవేపై కారులో వెళ్తుండగా.. అత్యంత నిర్లక్యంగా దూసుకొచ్చిన GJ13CF5257 అనే నెంబర్ ప్లేట్ ఉన్న మరో కారు ఢీకొట్టిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళన చెందామని.. అయితే తనతో పాటు కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడినట్లు వివరించారు. ముంబయి హైవేపై వాహనాలు పరిమితికి మించిన వేగంతో.. దూసుకెళ్తున్నాయని తెలిపారు. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమని.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకే ప్రమాదం అని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసులకు సూలే సిబ్బంది ఫిర్యాదు..

పరిమితికి మించిన వేగంతో పాటు నిర్లక్యంగా నడిపిన సదరు కారు డ్రైవర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రియా సూలే తరఫున సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>