Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం విజయ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్‌ (Vijay) కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా, పారదర్శకతతో కూడిన ప్రగతిశీల పాలన అందించాలని ఆకాంక్షించారు. తమిళనాడును మరింత అభివృద్ధి, సుసంపన్నత వైపు తీసుకెళ్లాలని కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>