సినిమా టికెట్ ధరలపై సుప్రీంకోర్టు స్టే

కలం, సినిమా : సినిమా టికెట్ ధరల (Movie Ticket Price) పెంపుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇంతకుముందు టికెట్ ధరలు పెంచాలంటే సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జనవరిలో మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలు  సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషన్‌లో నిర్మాతలు తమ వాదనలు వినిపిస్తూ, 90 రోజుల ముందస్తు నోటీసు నిబంధన అమలులో ఉంటే సినిమాల విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. చాలా సినిమాలు తక్కువ సమయంలో పూర్తై విడుదలకు సిద్ధమవుతాయని, అలాంటి పరిస్థితుల్లో ఈ నిబంధన వల్ల విడుదల తేదీలపై ప్రభావం పడవచ్చని వారు వాదించారు. అంతేకాకుండా, అన్ని వర్గాల అభిప్రాయాలు వినకుండా మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇలాంటి షరతులు విధించడం సరైంది కాదని కూడా వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ స్టే మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారమే సినిమా టికెట్ ధరల (Movie Ticket Price) పెంపుకు అనుమతులు కొనసాగనున్నాయి.

Read Also: బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు తప్పవ్.. ఆల్రెడీ 288 కేసులు నమోదు : మంత్రి ఉత్తమ్​

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>