Mobile Popup Ad
Mobile Popup Ad

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న అనుష్క.. వరుడు ఎవరంటే!

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్‌కు పెళ్లి కళ సంతరించుకుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న, అల్లు శిరీష్‌‌ ఓ ఇంటివారు కాగా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఈ సంవత్సరంలో పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. అలాగే కీరవాణి కుమారుడు కాలబైరవ ఓ టాలీవుడ్ నటితో ఏడడుగులు వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే.. టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి (Anushka Shetty) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. తన కుటుంబానికి బాగా సన్నిహితమైన ఒక ఇండస్ట్రీయలిస్ట్‌తో పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అనుష్క ఫ్యామిలీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మరోవైపు అనుష్క శెట్టి పెళ్లి (Marriage) గురించి గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్‌తో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, తాము కేవలం మంచి స్నేహితులమేనని ఈ ఇద్దరూ పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ, ఏదో ఒక సందర్భంలో వీరి పెళ్లి వార్త తెరపైకి వస్తూనే ఉంది. అలాగే ఓ వ్యాపారవేత్తతో, మరోసారి ఓ దర్శకుడితో అనుష్క (Anushka Shetty) వివాహం నిశ్చయమైందంటూ అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఎన్ని పుకార్లు వచ్చినప్పటికీ, అనుష్క మాత్రం తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతూ కేవలం తన సినిమాలపైనే దృష్టి పెట్టింది.

Read Also: 2.5 ఎకరాల్లో స్లమ్ ఏరియా సెట్.. నాని మూవీ కోసం భారీగా ఖర్చు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>