కలం, వెబ్ డెస్క్ : కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల (Karur Victims)కు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సీఎం సీ. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తూ జూలై 27న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
కోర్టు కీలక వ్యాఖ్యలు..
జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబంలోని కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంలో తప్పేముందని ప్రశ్నించింది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
హైకోర్టు గత తీర్పు నేపథ్యం..
అంతకుముందు మద్రాస్ హైకోర్టు ఈ నియామకాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16లకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కారుణ్య నియామకాల ప్రాతిపదికన వేచి చూస్తున్న వారి హక్కులను కాలరాస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేమని అభిప్రాయపడింది. ఇటువంటి మినహాయింపులు మరిన్ని డిమాండ్లకు దారితీస్తాయని పేర్కొంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో బాధిత కుటుంబాలకు పెద్ద ఊరట లభించింది.
Also Read : సెన్సస్‌లో 40 ప్రశ్నలు.. ప్రస్తావన లేని బీసీ కులం
Follow Us On: Instagram

