కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడలో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలను (Shishu Mandir School) బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (Alleti Maheshwar Reddy) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న బోధనా విధానాలను పరిశీలించారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రారంభమైన శిశుమందిర్ పాఠశాల తిరిగి ఇంగ్లీష్ మీడియంతో పునఃప్రారంభం కావడం హర్షణీయమని అన్నారు. శిశుమందిర్ పాఠశాలలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు, పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Also Read : ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

