రోహింగ్యా శరణార్థులకు సంబంధించిన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. మన దేశంలోని అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించిన వారికి అసాధారణ రక్షణ కల్పించాల్సిన అవసరం ఏమైనా ఉందా? అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. రోహింగ్యా శరణార్థులు కనిపించకుండా పోయారన్న అంశంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
విచారణలో న్యాయస్థానం, రోహింగ్యాలు( Rohingyas) సొరంగ మార్గాల ద్వారా భారత్‌లోకి ప్రవేశించి, ఆహారం, ఆశ్రయం వంటి హక్కులను డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా, పిటిషనర్‌ను ప్రశ్నిస్తూ, “వారికి రెడ్ కార్పెట్ వేసి, ఆహ్వానించాలని మీరు కోరుకుంటున్నారా?” అని అడిగింది. అలాగే, సుప్రీంకోర్టు “ఉత్తర భారతదేశంలో మనకు చాలా సున్నితమైన సరిహద్దు ఉంది. చొరబాటుదారులు చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే, వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత మనకు ఉందా?” అని వ్యాఖ్యానించింది.
ఈ విచారణలో సుప్రీంకోర్టు(Supreme Court) రోహింగ్యా శరణార్థుల హక్కుల పరిమితులు, దేశ భద్రత, చట్టపరమైన బాధ్యతల మధ్య సమతౌల్యాన్ని తీసుకోవాల్సిన అవసరాన్ని హైలెట్ చేసింది.
Read Also: శ్రీలంకకు పాక్ సాయం.. ఎక్స్‌పైర్ అయిపోయిన ఆహారం..
Follow Us on: Facebook


