ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు (AP Local Body Elections) సంబంధించి సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు తుది ఓటర్ల జాబితా విడుదలైతే, దాని ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఒకవేళ నోటిఫికేషన్‌ వెలువడే సమయానికి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) జాబితా అందుబాటులోకి రాకపోతే, ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరపాలని పేర్కొంది.

వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) ఈ అంశాలపై స్పష్టత ఇచ్చింది. ఇదే సమయంలో వైసీపీ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. అయితే నవంబర్ 12లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సిన గడువు ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు చేపట్టే చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వార్డుల పునర్విభజన పేరుతో ఎన్నికలను ఆలస్యం చేయాలని చూడటం ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడమేనన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉండటంతో, అందుబాటులో ఉన్న తుది జాబితా ఆధారంగా ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైనట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>