తన పార్టీలోకి సహచరుడికి విజయసాయిరెడ్డి ఆహ్వానం!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) శుక్రవారం కొత్త పార్టీ ఆవిర్భావ సంకల్పంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు కాలినడకన చేరుకున్న ఆయన, స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన కీలక ప్రకటన చేశారు.

తన నూతన రాజకీయ ప్రయాణంలో కలిసి రావాలని తన సహచరుడైన ఓవీ రమణ(OV Ramana)కు బహిరంగంగా విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. తన ఆప్తమిత్రుడు, టీటీడీ పూర్వ పాలకమండలి సభ్యుడు, ప్రస్తుత టీడీపీ నేత ఓవీ రమణతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గతంలో తాను, ఓవి రమణ నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశామని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy).. తమ మధ్య అనుబంధం చిరకాలం నిలుస్తుందన్నారు. తాము కలిసి పనిచేసి విజయం సాధిస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా శ్రేయస్సే తమ ప్రధాన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడటమే తమ మొదటి కర్తవ్యమని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జీయర్ స్వాములు, పీఠాధిపతుల అభీష్టం మేరకు తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని పునర్నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండా మిగతా విషయాలను వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.

Also Read : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>