తెగిపడిన విద్యుత్ తీగలను తాకొద్దు.. ప్రజలకు అధికారుల సూచన

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్ మహాలక్ష్మి వాడ, డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీల్లో శుక్రవారం విద్యుత్ భద్రతపై వినియోగదారులకు అవగాహన (Electrical Safety Awareness) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఈ వెంకటేశ్వర్లు పాల్గొని విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

విద్యుత్ స్తంభాలు, లైన్లకు దూరంగా ఉండాలని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకకుండా వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు స్వయంగా మరమ్మతులు చేపట్టకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>