కలం, వెబ్ డెస్క్ : అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం (Amaravati Land Case)లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పొంగూరు నారాయణలకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. వైసిపి నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో ఏపీ హైకోర్టు ఈ కేసులో నమోదు చేసిన సీఐడీ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
కేసులో తగిన ఆధారాలు లేవని, పరిపాలనాపరమైన పాలసీ నిర్ణయాలను నేరపూరిత కుట్రగా చిత్రీకరించడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ కక్ష సాధింపు, దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారన్న హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు లేవని సుప్రీంకోర్టు తెల్చిచెప్పడంతో గత వైసిపి హయాంలో నమోదైన ఈ సీఐడీ కేసు ముగిసినట్లయింది.
Also Read : డ్వాక్రా మహిళకు శుభవార్త.. రూ.3 లక్షల వరకు రుణం
Follow Us On : WhatsApp

