కలం, నల్లగొండ: తెలంగాణలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (MLA Raj Gopal Reddy ) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నిన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తున్నారా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్న వేళ తాజాగా రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, రాహుల్‌గాంధీ (Rahul Gandhi) నాయకత్వంలోనే పనిచేస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌ను ఏనాడూ విమర్శించలేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి ఆధిపత్యం ఉండొద్దని మాత్రమే చెప్పానని తెలియజేశారు. నిజమైన కాంగ్రెస్ నేతలను అణచివేయొద్దని కోరారు. ఉద్యమకారులకు కాంగ్రెస్‌లో గుర్తింపు ఉండాలని ఆకాంక్షించారు.
సీమాంధ్ర చెప్పుచేతల్లో ఉండొద్దు
తెలంగాణ ఆత్మగౌరవం కోసమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్న రాజగోపాల్ రెడ్డి (MLA Raj Gopal Reddy).. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర చెప్పుచేతల్లో ఉండొద్దని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితులు వేరేలా ఉన్నాయని తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం పనిచేయాలి తప్ప, కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం పనిచేయొద్దని హితవు పలికారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అయితే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Also Read : ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

