ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా విజయలక్ష్మి బాధ్యతలు

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కార్యనిర్వాహక సంచాలకులుగా పి. విజయలక్ష్మి (Vijayalakshmi) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ​జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, కలెక్టర్ సమక్షంలో ఆమె ఈ బాధ్యతలను చేపట్టారు. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన ఆర్. ఉపేందర్ రావు నుండి పి. విజయలక్ష్మి బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ​

ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈడీ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాలోని షెడ్యూల్డు కులాల సంక్షేమానికి, వారి ఆర్థిక సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>