పవన్ కళ్యాణ్​తో గ్రామాల్లో అభివృద్ధి: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్​ కారంగానే గ్రామాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రశంసించారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్ తనదైన మార్క్ చూపిస్తున్నారని కొనియాడారు. పవన్ నాయకత్వంలో చేపట్టిన పల్లె పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయమైందన్నారు. కేంద్ర పథకాలను నిరంతరం ఫాలో అప్ చేసుకుంటూ.. తనదైన శైలిలో ముందుకెళ్తున్నారని తెలిపారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తన అనుభవం, పవన్ కళ్యాణ్ ఉత్సాహం, కేంద్రం సహకారంతో ఏపీ అభివృద్ధి పట్టాలెక్కుతోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పల్లెల్లో రూ.1.30 లక్ష​ల కోట్లతో, పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని వివరించారు. 15,500 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

బ్లీచింగ్ పౌడర్ కొనలేని పరిస్థితి..

వైసీపీ ప్రభుత్వం గ్రామాలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాకుండా దారి మళ్లించి, అభివృద్ధిని అడ్డుకుందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతలు రోడ్లు వేస్తున్నామంటూ.. డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయాలన్నా.. లేని పరిస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుందోన్నారు.

ఉదయగిరి నియోజకవర్గంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి.. నిధులు మంజూరు చేస్తోందన్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టి పేదలకు కడుపు నిండా తిండి పెడుతున్నామని వివరించారు. ఎన్ని ఇబ్బందులున్నా రూ.33 వేల కోట్లతో పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. తాము వచ్చేనాటికి రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని.. వెంటిలేటర్ మీదకు వెళ్లిపోయిందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>