మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు (Meenakshi Natarajan) సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారించి, దానిని కొట్టివేసింది. ఈ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ సమస్యపై ఆమెకు ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించవచ్చని లేదా ఎన్నికల సంఘానికి విన్నవించుకోవచ్చని న్యాయస్థానం (Supreme Court) స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>