Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ !

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ (Justice Lisa Gill) నియమితులు కానున్నారు. ఈ మేరకు ఆమె పేరును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరో రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, కొలీజియం ఈ ముందస్తు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్ ప్రస్తుతం పంజాబ్, హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.

జస్టిస్ లీసా గిల్ (Justice Lisa Gill) BA, LLB తో పాటు LLM పూర్తి చేశారు. ఆమె 1990వ సంవత్సరంలో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించి, సుదీర్ఘ కాలం పాటు న్యాయరంగంలో విశేష సేవలందించారు. ఆమె ప్రతిభను గుర్తించిన ఉన్నతాధికారులు 2014లో ఆమెను పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు బాధ్యతలు చేపట్టనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>