Mobile Popup Ad
Mobile Popup Ad

మోడీని క‌లిసిన టాలీవుడ్‌ కొత్త జంట‌

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ న్యూ వెడ్ క‌పుల్ ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna), విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) పెళ్లి అయిపోయిన వెంట‌నే రిసెప్ష‌న్ ప‌నుల్లో బిజీ అయిపోయారు. ఉద‌య్‌పూర్‌లో త‌మ స‌న్నిహితులు, మిత్రులు, కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్నారు. మార్చి 4న హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్‌లో వీరి రిసెప్ష‌న్ జ‌రుగ‌నుంది. ఈ వేడుక‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ కొత్త జంట ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (PM Modi)ని క‌లిసి కోరింది. ర‌ష్మిక‌, విజ‌య్ మోడీకి ఇన్విటేష‌న్ కార్డు అంద‌జేశారు. ఇప్ప‌టికే మోడీ వీరి సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ ప్ర‌త్యేక లేఖ‌ను విడుద‌ల చేశారు. ఇక రిసెప్ష‌న్‌కు మోడీతో పాటు అమిత్ షాకు కూడా ఆహ్వానం అందింది. ఇంకా చాలామంది సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను రిసెప్ష‌న్‌కు ఆహ్వానిస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు అన్ని సినీ ప‌రిశ్ర‌మ స్టార్స్ ఈ రిసెప్ష‌న్‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>