Mobile Popup Ad
Mobile Popup Ad

డబ్బులు ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్రంలో అభివృద్ధి: సునీల్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలో ‘డబుల్ ఇంజన్’ సర్కార్ వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి.. సంక్షేమం వేగవంతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Sunil Rao) అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని 12 సంవత్సరాల పరిపాలన సాధించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ మల్కకొమురయ్య తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… గత 12 సంవత్సరాల మోదీ పరిపాలనలో దేశం అన్ని రంగాల్లోనూ అపూర్వమైన ప్రగతిని సాధించిందని కొనియాడారు. ప్రజలు మోదీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దేశ భద్రతను పటిష్టం చేయడంతో పాటు ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని ఒక అగ్రగామిగా నిలిపేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజలు మొదటి సారి భారతీయ జనతా పార్టీ కి అవకాశం ఇచ్చి ప్రధాన మంత్రిగా మోడీకి అవకాశం కల్పించారు. రెండో సారి మోడి చేసిన దేశ ప్రగతి చూసి అవకాశం ఇవ్వగా.. దేశానికి మోడి నాయకత్వమే బధ్రత కల్పిస్తుందని.. అభివృద్ధిలో దేశం ముందుకు సాగుతుందనే పూర్తి నమ్మకంతో ప్రజలు భారీ మెజారిటీతో అవకాశం కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చారిత్రాత్మక నిర్ణయాలతో నరేంద్ర మోడీ భారత దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని కొనియాడారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ.. నరేంద్ర మోడీ పాలన ముందుకు సాగుతుందని తెలిపారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం పరిపాలన సాధించిన చరిత్ర ప్రధాని మోడీకి దక్కిందని.. చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని తెలిపారు.

రాబోయే రోజుల్లో ఇదే స్పూర్తితో భారతదేశానికి ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మోడి ఉన్నారని తెలిపారు. 2014కు ముందు దేశంలో నెలకొన్న పరిస్థితులకు, ఆ తర్వాత వచ్చిన సానుకూల మార్పులకు స్పష్టమైన వ్యత్యాసం ఉందని, నేడు అభివృద్ధి కళ్లముందే కనిపిస్తోందని వారు గుర్తుచేశారు. ఒకప్పుడు ప్రజల్లో ఉన్న అభద్రతా భావం మోదీ పాలనతో తొలగిపోయిందని అన్నారు. మోడి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చాలా ప్రాంతాల్లో రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని.. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ చారిత్రాత్మక నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల శరవేగంగా దేశం ముందుకు దూసుకెళ్తోందని ఇదే స్థాయిలో బీజేపికి అధికారం కట్టబెడితే రాష్ట్రం లో కూడ అభివృద్ధి సంక్షేమం శరవేగంగా ముందుకు దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>