భారత బౌలర్లపై గవాస్కర్ ఫైర్: 250 కొట్టినా ఓడటంపై ప్రశ్నలు!

కలం, స్పోర్ట్స్: రాంచీ T20 మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమి పాలవ్వడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మ్యాచ్‌లో భారత్ 249 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, వెస్టిండీస్ మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఈ ఓటమిపై స్పందించిన గవాస్కర్, టీమిండియా బౌలింగ్ తీరుపై నేరుగా ప్రశ్నలు గుప్పించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఊహించిన దానికంటే ఎక్కువే పరుగులు చేసిందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. బ్యాటర్లు తమ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చారని, అందుకే ఓటమికి బ్యాటర్లను తప్పుపట్టలేమని ఆయన స్పష్టం చేశారు.

మైదానంలో మంచు ప్రభావం ఉన్నప్పటికీ, భారత బౌలర్లు వేయాల్సిన రీతిలో అసలు బౌలింగ్ చేయలేదని ఆయన విమర్శించారు. బౌలర్ల నుంచి బౌలింగ్ కోచ్ ఏం ఆశించారు, అసలు బౌలర్లు దానిని అమలు చేశారో లేదో ఆయననే నేరుగా అడిగితే బాగుంటుందని గవాస్కర్ (Sunil Gavaskar) వ్యాఖ్యానించారు. అదే చర్చలో పాల్గొన్న మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ కూడా భారత కెప్టెన్సీ నిర్ణయాలను తప్పుపట్టారు. మొదటి ఓవర్లోనే విండీస్ రెండు వికెట్లు కోల్పోయినప్పుడు పేస్ బౌలింగ్‌ను కొనసాగించాల్సింది అని ఆరోన్ తెలిపారు. అలా కాకుండా, కొత్త బంతిని ఎదుర్కొనేందుకు తడబడే బ్యాటర్లు క్రీజులో ఉన్న వేళ పవర్ ప్లేలోనే అక్షర్ పటేల్‌కు బంతిని ఇవ్వడం అనవసరమని ఆరోన్ పేర్కొన్నారు.

Also Read : విండీస్ మ్యాచ్ ఓటమిపై గంభీర్ సంచలన కామెంట్స్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>