జగన్‌కు ఈడీ షాక్.. హైకోర్టులో సంచలన పిటిషన్!

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో (Jagan Assets Case)  కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి నమోదైన కేసులపై త్వరితగతిన తేల్చాలని హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. జగన్ పై నమోదైన 9 ఈడీ ఛార్జ్‌షీట్లపై రోజువారి ప్రాతిపదికన విచారణ చేపట్టి, సాధ్యమైనంత వేగంగా కొలిక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడం లేదని పిటిషన్ లో ఈడీ పేర్కొంది. ఆర్థిక నేరాలను దేశ ఆర్థిక ఆరోగ్యానికే ముప్పుగా పరిగణించాలని ఈ సందర్భంగా హైకోర్టును ఈడీ కోరింది. ఈ క్రమంలోనే ఈ కేసుల్లో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్‌తో పాటు మిగిలిన నిందితులందరూ విచారణ సమయంలో ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో ఈడీ స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 13న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది.  అయితే గత కొన్నేళ్లుగా ఈ కేసుల విచారణ ఆలస్యమవుతోందనే వాదనల మధ్య ఈడీ వేసిన ఈ పిటిషన్ ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>