ప్రాణాలు తీస్తున్న ఈత సరదా..

కలం, మెదక్ బ్యూరో : వేసవికాలం వస్తుందంటే మెదక్ (Medak) జిల్లాలో ఏదో ఒక చోట ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతోంది. పిల్లలకు వేసవి సెలవులు, ఒంటిపూట బడులు ఉన్న నేపథ్యంలో ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఉమ్మడి మెదక్ (Medak) జిల్లా వ్యాప్తంగా గత ఏడాది వేసవి కాలంలో వివిధ ప్రాంతాల్లో సుమారు 15 మంది పిల్లలు మృత్యువాత పడి వారి కుటుంబాలకు తీరని శోకమును మిగిల్చారు. జిల్లాలోని ప్రాజెక్టులు, కెనాల్స్, చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల వద్ద ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారం గజ్వేల్ లో మల్లన్న సాగర్ కాలువలో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందారు.

సరదా కోసం వేసవిలో ఈతకు వెళ్లే పిల్లలకు నీటి లోతు తెలియకపోవడం వల్ల జారి నీటిలో పడిపోయే ప్రమాదాలు జరగదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏదైనా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. చుట్టు పక్కల పిల్లలతో పాటు ఈతకు పంపవద్దు. ముఖ్యంగా గ్రామాల్లోని బావులు, చెరువుల వద్ద భద్రతా నియమాలు, పెద్దల పర్యవేక్షణ పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చును. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో ఎక్కువగా ఈతకు వెళ్లే ప్రాంతాలు చెరువులు, వ్యవసాయ బావులు.. ఇతర ప్రాంతాలను గుర్తించి రక్షణగా చర్యలు తీసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు శివారు గ్రామాల్లో, ప్రాజెక్టుల పరివాహ ప్రాంతాల్లో ఈతకు వెళ్ళి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈత నేర్చుకునే క్రమంలో పిల్లలకు స్విమ్మింగ్ ట్యూబ్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి..

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ పిల్లలకు ఈత నేర్పించాలని అనుకుంటే తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలోనే నేర్పించాలి. పిల్లల సరదా తల్లిదండ్రులకు జీవితాంతం మిగిలే విషాదంగా మారకూడదు. నిర్లక్ష్యం కారణంగా పిల్లలు చనిపోయే అవకాశం ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను ఒంటరిగా ఈతకు పంపొద్దు. ఈత వచ్చిన వారి విషయంలోనూ తగిన జాగ్రత్తలు చెప్పాలని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>