Mobile Popup Ad
Mobile Popup Ad

వేసవిలో పెరుగు తింటే.. ఎన్నెన్నో లాభాలు!

కలం, వెబ్ డెస్క్: ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి. ఈ సమయంలో మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటామో.. ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది. అన్నింటికన్నా చవకైన..అనేక ప్రయోజనాలు కలిగిన పెరుగు (Curd) తీసుకోవడం వలన ఈ వేసవిలో ఎన్నో లాభాలున్నాయి. అవేంటో చూద్దాం..!

శరీరం నిరంతరం కూల్ గా..

వేసవిలో పెరుగు తినడం వలన హీట్ స్ట్రోక్‌ నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు. ఎందుకంటే, పెరుగు మన శరీర ఉష్ణోగ్రతను చాలా వరకు తగ్గిస్తుంది. శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. ఇందులో బ్యాక్టీరియా జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంటుంది. రోగనిరోధక శక్తిని అమాంతం పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. పెరుగు తినడం వలన ఆకలి పూర్తి నియంత్రణలో ఉంటుంది. కడుపు నిండిన భావన కలగడంతో ఎక్కువ ఆహారం తినకుండా జాగ్రత్త పడొచ్చు. దాని వలన అధిక కొవ్వు అనే మాట ఉండదు. అంతేగాకుండా, చర్మాన్ని కాంతివంతంగా, తాజాగా ఉంచడంలో దీన్ని మించింది లేదు. అందుకే, వైద్యులు వేసవి కాలంలో పెరుగు కచ్చితంగా తీసుకోవాలని సిఫార్సు చేస్తుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>