గ్రేటర్ పోరుకు సిద్ధం.. నేడు కల్వకుంట్ల కవిత ‘రాజధాని రణభేరి’

కలం, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ సమరానికి టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్ వేదికగా ‘రాజధాని రణభేరి’ (Rajadhani Ranabheri) పేరిట కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలైన కవిత నాయకత్వంలో జరగనున్న ఈ సమావేశానికి రాజధాని పరిధిలోని మూడు కార్పొరేషన్ల నుంచి ముఖ్య నాయకులు భారీగా హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ముద్ర వేయడమే ధ్యేయంగా కవిత ఈ వేదిక ద్వారా ఎన్నికల ఎజెండాపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ వేదికగా మూడు కార్పొరేషన్ల పరిధిలోని మొత్తం 300 డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి వ్యూహాలపై కవిత స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ప్రాథమిక నాయకులతో శ్రేణులను సమాయత్తం చేసిన ఆమె, ఈ సమావేశం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. రాజధాని నగరంపై పట్టు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న ఈ రాజధాని రణభేరి సభ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>